హన్మకొండ ప్రభుత్వ ఐటీఐ లో ఉద్యోగ మేళా

నిర్మాణ రంగంలో ఉన్న ఎల్‌బీటీ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16న హన్మకొండ ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ (బాలురు)లో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రధానాచార్యులు జుమ్లా నాయక్‌ తెలిపారు. ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి కంచీపురం, చెన్నైలలో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి నెలకు రూ.11వేల చొప్పున వేతనం చెల్లిస్తారన్నారు. అభ్యర్థులు ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌, వెల్డర్‌ కోర్సు చేసి ఉండాలన్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయసు కలిగిన వారు అర్హులన్నారు. కేవలం పురుషులు మాత్రమే పాల్గొనాలని ఈ అవకాశాన్ని ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువకులు వినియోగించుకోవాలని కోరారు

No comments:

Post a Comment